నలుగు వలన కలిగే ఉపయోగాలు
సాధారణంగా చలికాలంలో స్నానానికి ముందు నలుగు పెట్టుకోవటం వలన చర్మము పొడిబారే సమస్య నుండి దూరంగా ఉండవచ్చు. ఇంకా చర్మ సమస్యలు దూరం అవుతాయి.
నలుగు పిండి తయారీ విధానము:
పసుపు, ఆవపిండి, ఉలవపిండి, గంధము, మారేడు పత్రాలు,పొడిని ఉపయోగించవచ్చు. వీటితో పాటు బియ్యపు పిండి,శనగపిండి గరుకుగా పొడి చేసుకొని కలుపుకోవాలి. నలుగు పిండి మరి తడిగా మాత్రమూ ఉంచకూడదు. శరీరానికి పట్టించి,వ్యతిరేక దిశలో మర్దన చేసుకోవాలి. ఆలాగు చేయటంవలన శరీరానికి అంటుకున్న మురికి,అవాంఛిత రోమాలు,మృతకణాలు తొలగిపోతాయి. కానీ చివర్లో కొంచెం నువ్వుల నూనె అద్దుకొని మేనికి రాసుకోవాలి. లేకపోతె ఆవుపాలు మీద మీగడ వాడుకోవచ్చు. ఇదేవిధంగా వారానికి ఒకసారి శరీరానికి నలుగు పెట్టుకోవటం వలన చర్మము మృదువుగా,ఇంకా కాంతివంతముగా తయారుఅవుతుంది.