కీళ్ల నొప్పులు వస్తే ఆపరేషన్ లేకపోతె మందులు వాడుతూ ఉంటాం. అయితే కొన్ని సూత్రాలు పాటిస్తే ఉపశమనం కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
- సహజంగా కుళ్ళ నొప్పులు ఉదయం పూట చాల ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాము. అందుకని ప్రతి రోజు రాత్రి పూట మందులు వాడుతూ ఉంటాము. కొన్ని సందర్భాలలో ఐంట్మెంట్ వాడుతూ ఉంటారు.
- నొప్పులు ఉన్నచోట యూకలిఫ్టస్ ఆయిల్ పూసుకొని వేడినీళ్లతో కాపడం పెట్టుకోవాలి. మెత్తటి తువాలు వేడినీళ్లలో ముంచి బాగా పిండుకొని తరువాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చేత పెట్టుకోవాలి.
- తేలికపాటి వ్యాయము ఇంకా సైక్లింగ్,ఈత,నడక కూడా నొప్పులు నివారించడములో సహకరిస్తాయి.
- క్రింద కూర్చోనేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూర్చోవాలి.
- అధిక బరువు ఉండేవాళ్ళు బరువు తగ్గేమార్గము ఆలోచించుకోవాలి.
- ముఖ్యముగా పెయిన్ కిల్లర్స్,పాలుఉర్లగడ్డలు వాడకూడదు.
- విటమిన్ C కి సంబంధించిన పండ్లు అధికముగా తీసుకోవటం మంచిది. జామపండు,కమలాపండు,మొదలైనవి.
- వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం మంచిది.
- క్యారెట్ జ్యూస్, క్యాబేజి సూప్ తీసుకోవటం వలన కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి.
- కాస్త ఉప్పు కలిపినా నీటిలో చింత ఆకులు ఉడికించి శరీరములో నొప్పులు ఉన్న చోట ఆ నీటిని పోయాలి.