చల్లారిన ఒక కప్పు టీ నీళ్లలో ఒక రెండు స్పూన్ల బియ్యపు పిండి,ఇంకా తేనే కలిపి ముఖానికి రాసుకోవాలి. బియ్యపు పిండి మంచి స్క్రబ్ లా పనిచేస్తుంది. తేనే చర్మానికి తేమనిస్తుంది. ఈ రెండింటిని కలిపి వాడడం వలన చర్మానికి కండిషనర్ దొరికినట్టే.
ఒక టేబుల్ స్పూన్ ఉడికించిన ఔట్స్ని మెత్తగా చేసి రాసుకుంటే చర్మం మీద మంట తగ్గుతుంది. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మిమ్మరసం కలిపి రాసుకుంటే నిర్జీవంగా ఉన్న చర్మము కాంతివంతమువుతుంది. సున్నితమైన చర్మము గలవాళ్ళు నిమ్మరసములో కొన్ని నీళ్లు కలిపి గాఢతను తగ్గించి వాడాలి.
శనగపిండి,పసుపు,పెరుగు వీటినన్నిటిని కలిపి రాసుకోవటం వలన చర్మము పై ఉండే ట్టాన్ పోతుంది. పసుపు నల్లటి మచ్చల్ని,పొగ్గటం లో సహాయపడుతుంది.
ఎక్కువ ట్టాన్ ఉంటె పెరుగు బాగా పనిచేస్తుంది. వీటి వలన చర్మాన్ని ఎటువంటి హాని కలగదు.