తెల్లగా కనిపించాలి అని వైటనింగ్ లోషన్,క్రీమ్ లు వాడి విసుగుపోయారా.
ఇంట్లోనే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి ఏమిటి అనేది తెలుసుకుందాం.
ఒక స్పూన్ పంచదార లో నిమ్మరసం కలిపి ముఖంతో పాటు శరీరమంతటా పంచదార కరిగే వరకు బాగా రుద్దాలి.
క్యాబేజి ఇంకా జీలకర్ర నీళ్లలో ఉడికించాలి. ఈ నీళ్లతో ముఖాన్ని శుబ్రము చేసుకుంటే మెరిసే చర్మము మీ సొంతము
గుడ్డు తెల్లసొన,తేనే కలిపి ముఖానికి ప్యాక్ వేసుకొని ఒక 20 నిముషాలు ఉంచుకోవాలి. ఇది చర్మానికి యవ్వనకాంతినిస్తుంది.
పొద్దుతిరుగుడుపువ్వు గింజల్ని పచ్చి పాలతో ఒక రాత్రిఅంత నానబెట్టి రుబ్బాలి. ఇందులో చిటికెడు కుంకుమపువ్వు,పసుపు కలిపి రాసుకోవాలి.
ఆలు లేదా టమోటా రసాలను ప్రతి రోజు రాసుకుంటే చర్మము కాంతివంతముగా ఉంటుంది.
మీగడలో బ్రెడ్ ముక్కలు కలిపి రాసుకున్న చర్మము మృదువుగా తయారు అవుతుంది.