పాదాలకు క్యారెట్ ను వాడటం వలన కలిగే ఉపయోగాలు.
క్యారెట్ ను తురుముకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ చేర్చి ప్యాక్ లాగా వేసుకుంటే పాదాలు మృదువుగా తయారు అవుతాయి. ఇదేవిధముగా ఒక అరా టీ స్పూన్ పసుపు, తాజా కొబ్బరి తురుము ఒక అరకప్పు తీసుకోవాలి. ఈ రెండిటిని బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దన చేసుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగివేయాలి.
వారి కాలు మృదువుగా ఉండాలంటే తరుచు వాటిని కొబ్బరినూనె తో మర్దన చేస్తుండాలి. కాలేజీలకు స్కార్ట్లు వేసుకునే వారిలో మొక్కలు నల్లగా ఉంటె బాగుండదు. అందుకు కమలాపండు ముద్దలా చేసుకొని కొబ్బరినూనెలో అరగంట పాటు నానబెట్టి ఆ మిశ్రమాన్ని ప్యాక్ లాగా వేసుకోవాలి. తరువాత శనగపిండి,పాలు,తేనే ఒకొక్క స్పూన్ చెప్పున కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మోకాళ్ళు కు బాగా పట్టించి అరినాక శుభ్రముగా కడుగుకోవాలి. కిర జ్యూస్ లో బియ్యపు పిండిని కలిపి పాదాలకు ప్యాక్ గ వేసుకుంటే కాళ్ళ పగుళ్లు తగ్గుతాయి. కొందరికి పదాలు మడమలు మెట్టుగా బిరుసైన చర్మము తో ఉంటాయి. ఇటువంటి వారు నిమ్మరసము పంచదార కలిపినా మిశ్రమములో మర్దనా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
ఒక స్పూన్ శనగపిండి పుల్లగా ఉన్న పెరుగు తీసుకొని కలిపి ఒక మిశ్రమముల చేసుకొని దానికి కాస్త పసుపు కలిపి పాదాలకు రాసి కాస్త అరినాక గట్టిగ రుద్ది కడిగితే మృతకణాలు తొలగిపోతాయి.