మీ ముఖము మీద మొటిమలు లేకుండా ఆకర్షణీయముగా ఉండాలి అంటే, కంటి కింద చారలు రాకుండా ఉండాలి అంటే మీ మనస్సుని ప్రశాంతముగా ఉంచుకోండి. మంచి ఆలోచనలతో,ఆశావహంగా భావనలతో ఉంటె రక్తప్రసరణ బాగుండి, మీ ముఖము ప్రకాశవంతంగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. ఈ మొటిమల నుండి ఉపశమనానికి కొన్ని చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయుర్వేదంలో రంజిక పిత్తమ అనబడే హార్మోన్ల ప్రభావము వలన ఈ స్థితి వస్తుంది. తెల్ల నువ్వులు, పాతబెల్లం కలిపి ఉండలు చేసుకుని ఆడపిల్లలు ఉదయము,సాయంత్రము,తీసుకుంటే ఈ హార్మోన్లు సహజంగానే సమస్థితికి చేరుతాయి. మగపిల్లలో మినప సున్ని ఉండలు రాత్రిపూట తినటం మంచిది.
గిన్నెలో నీళ్లు మసలు పెట్టి ఆవిరిని ముఖానికి పట్టడం వలన హితకరం,ఈ ఆవిరి ఒక 8 నుండి 10 నిముషాలు పడితే చాలు.
వేపపులు చూర్ణించినా ముద్దలో కొంచెము పసుపు,వెన్నపూస,కలిపి పొక్కులపై రాసి ఒక గంట తరువాత కడిగి వేయాలి. ఆలా చేయటము వలన మంచి ఫలితాలు ఉంటాయి.
కాకరకాయని మధ్యలో చీల్చి, చీల్చిన తెల్లటి భాగములో చర్మము పై సున్నితముగా రుద్దటం వలన మంచి ఫలితాలు ఉంటాయి.
పోక చెక్క నీళ్లతో గంధము తీసి ముఖానికి పట్టించి ఒక మూడు గంటల తరువాత కడిగివేసుకోవాలి.
ఉసిరిక వలపు,తమలపాకు పై రాసుకునే కాచు కలిపి దానిలో బాదాం తో పాటు కలిపి ఒక చూర్ణము చేసి ఒక పావు స్పూన్ చెప్పున తీసుకుంటే తెల్లటి మచ్చలు పోతాయి.
పాలమీగడలో పసుపు,పొట్లకాయ,పై పొత్తు నువ్వులు కలిపియు ముఖానికి రాసుకుంటే అన్ని మొటిమలు పోయి ముఖము అందముగా తయారుఅవుతుంది.